శనివారం మీ రాశిఫలాలు (23-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి…

మేష రాశి : మార్చి 21 – ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులకు ఈరోజు ఏదైనా మంచి అవకాశం రావచ్చు. అలాగే మీ సమస్యలన్నీ త్వరలో తీరిపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 – మే 20

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి మరియు శృంగార సమయాన్ని గడపాలి. మీ ప్రియమైన వారి మనోవేదనలన్నింటినీ తొలగించడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. ఈ అవకాశాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకుంటే మంచిది. ఎందుకంటే ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఉద్యోగస్తుల పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే చాలా కాలంగా ఎదుర్కొంటున్న రుణ బాధలు ఈరోజు తొలగిపోవచ్చు. శారీరకంగా బలంగా ఉండటంతో మీరు అన్ని పనులు చేయగలుగుతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 – జూన్ 20

ఈ రాశి వారిలో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడితే, ఈ సమయం మీకు చాలా ముఖ్యం. మీ అధ్యయనాలలో ఏదైనా అడ్డంకి ఉంటే, మీరు ఆన్‌లైన్ తరగతుల ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉద్యోగులు పని విషయంలో ఈరోజు తొందరపడకూడదు. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, ఈ రోజు మీరు ఉపశమనం పొందవచ్చు. మీరు మీ పనిని జాగ్రత్తగా చేయండి. ఈ రోజు వ్యాపారులకు సవాలుగా ఉంటుంది. సులభంగా పూర్తి చేసే పనులలో చాలా అడ్డంకులు ఉండవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది, ప్రతికూల పరిస్థితుల్లో మీ కుటుంబానికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 – జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఆర్థికంగా అవసరమైన వారికి కూడా సహాయపడవచ్చు. ఇలాంటి గొప్ప పని చేయడం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు ఇంటి సభ్యుల ప్రవర్తన ఈ రోజు మీ పట్ల సరిగ్గా ఉండదు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఉద్యోగులు పని విషయంలో ఆందోళన చెందుతారు. వ్యాపారులు నిరాశకు గురౌతారు. ముఖ్యంగా మీరు కాస్మెటిక్, బట్టలు లేదా ఇనుముతో వ్యాపారం చేస్తే, మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట… మీ రాశి కూడా ఉందేమో చూడండి…!

సింహ రాశి జులై 23 – ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఈరోజు నిరుద్యోగులు చాలా ఆందోళన చెందుతారు. ఉద్యోగం పొందడంలో ఆలస్యం మీ ఒత్తిడిని పెంచుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మీరు ఓపికగా ఉండాలి. త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. వ్యాపారులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగానే ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు ప్రయోజనం ఉండదు. అందుకే తొందరలో నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం రాకపోవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 – సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులు ఏదైనా డిమాండ్ చేస్తే వాటిని నెరవేర్చేందుకు పూర్తి విశ్వాసంతో పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు కొంత సొమ్మును స్నేహితుడికి కూడా ఇవ్వొచ్చు. కుటుంబ వివాదాలకు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 3:30 గంటల వరకు

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే…!

తుల రాశి : సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22

ఈ రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు పూర్తిగా అంకితభావంతో ఉండండి. మీ ఉన్నతాధికారులకు ఎటువంటి సాకులు చెప్పకండి లేదా అబద్ధం చెప్పకండి. వ్యాపారులకు ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు కష్టపడి, నిజాయితీగా పని చేయాలి. త్వరలో దీని ఫలితం చూస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి కొంత ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 – నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడవచ్చు. వ్యాపారులకు ఈరోజు వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అసంతృప్తిని అధిగమించగలుగుతారు. ఉద్యోగులు ఉద్యోగాలను మార్చడానికి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 – డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పూర్తి విశ్వాసం మరియు సానుకూలతతో ఉంటారు. మీరు కష్టతరమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలరు. మీకు ఆఫీసులో అదనపు పని ఇస్తే, అందరితో కలిసి పనిచేయగల మీ సామర్థ్యం మీ పనిని సకాలంలో పూర్తి చేస్తుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపడకపోవడమే మంచిది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల అభిమానం మరియు ఆశీర్వాదాలను పొందుతారు. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 – జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇది మీకు శాంతిని ఇస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీకు ఉన్నతాధికారుల మద్దతు లభించకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కుంభ రాశి : జనవరి 20 – ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే, మీరు వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలి. గుర్తుంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే, జీవితంలో విజయం సాధించగలరు. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు మంచి ఫలాలు లభిస్తాయి. మీరు కొన్ని ముఖ్యమైన పనులను ఈ రోజు పూర్తి చేయవచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఈ రోజు ఖర్చులు తక్కువగా ఉంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 – మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ కోసం తగినంత సమయం పొందుతారు. మీరు చాలా వినోదం పొందుతారు. మీ ప్రియమైన వారితో సమయం గడపండి. ఈ క్షణాలు మీకు గుర్తుండిపోతాయి. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు కృషి చేస్తారు. అదేవిధంగా, మీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి, త్వరలో మీకు మంచి ఫలాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి 4 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం… ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.